ఇప్పటివరకు శ్రీ వేంకటేశ్వరశర్మ గారు ఈ కార్యక్రమాలనన్నిటినీ అమ్మ పేరు మీద నెలకొల్పిన "శ్రీమ్ అపర్ణా సేవా ట్రస్ట్" ఆధ్వర్యంలో రూపకల్పన చేస్తున్నారు, నిర్వర్తిస్తున్నారు. రాను రాను ఈ కార్యక్రమాల సంఖ్య పెరుగుతోంది. ఆర్ధికంగా కూడా కొంతమంది ట్రస్ట్ కి ఇతోధికంగా సాయమందిస్తున్నవారు ఉంటున్నారు. ట్రస్ట్ రాబోయే రోజులలో మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది.
సేవాకార్యక్రమాల పరిధిని గ్రామ స్థాయిని దాటి, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలానే ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజల అవసారాలకు తగ్గట్టు సేవలందించడానికి ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. ట్రస్ట్ కు పలువిధాలుగా చేయూతనిచ్చిన, ఇస్తున్న అందరికి ట్రస్ట్ మరింత జవాబుదారిగా ఉండడం కోసం, ఆర్ధిక సాయందిస్తున్న వారికి ఇన్ కంటాక్స్ నుండి వెసులుబాటును కల్పించడం కోసం శ్రీ వేంకటేశ్వరశర్మ గారు ది. 11/1/2016న "శ్రీమ్ అపర్ణా సేవా ట్రస్ట్" ను ఆయన అధ్యక్షతన, తొమ్మిది మంది సభ్యుల బృందంతో రిజిష్టర్ చేయించడం జరిగింది. ట్రస్ట్ రిజిష్టర్ నంబరు: 3/2016.
ముందు చెప్పినట్టుగా ట్రస్ట్ రిజిష్టర్ చేయడంలో ముఖ్యఉద్దేశం ట్రస్ట్ కి, సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చిన ప్రతీ ఒక్కరికీ ట్రస్ట్ ను జవాబుదారీగా ఉంచడం. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం జనవరి నెలలో ట్రస్ట్ కి ఆ సంవత్సరంలో ఎంతమంది సాయమందించారు, ఎంత ఆదాయం వచ్చింది, ఏ, ఏ కార్యక్రమాలను ట్రస్ట్ చేపట్టింది, వాటి నిమిత్తం ఎంతెంత ఖర్చు అయినదీ అంతా ఇదే వెబ్ సైట్ నందు ప్రచురించడం జరుగుతుంది. జరిగే ప్రతీ కార్యక్రమం యొక్క వివరాలు, ఫొటోలతో సహా ఈ వెబ్ సైట్ నందు ఎప్పటికప్పుడు ప్రచురించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఎపుడైనా శ్రీ శర్మ గారి నుండి కాని, ట్రస్ట్ సభ్యుల నుండి కాని ట్రస్ట్ కి సంబందించి ఏ వివరాల కోసమైనా, సేవా కార్యక్రమాల వివరాలకైనా సంప్రదించవచ్చు.
1. శ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్, సభ్యులు
2. డా॥ శ్రీ ఆకొండి నాగ శ్రీనివాస్, సభ్యులు
3. శ్రీ బత్తుల వీరభద్రం, సభ్యులు
4. శ్రీ తుమ్మూరి శ్రీరామారావు, సభ్యులు
5. శ్రీమతి గ్రంధి నాగమణి, సభ్యులు
6. శ్రీ ఆకుల గంగాధరరావు, సభ్యులు
7. శ్రీ ఆవంత్స వెంకట సుబ్రహ్మణ్య ప్రసాద్, సభ్యులు
8. శ్రీ అల్లంరాజు రామరాజేశ్వరరావు, సభ్యులు
9. శ్రీమతి ఆకొండి వెంకట సూర్యలక్ష్మి, సభ్యులు
ట్రస్ట్ కు అందించే ఆర్ధిక విరాళాలకు ఇన్కంటాక్స్ సెక్షన్ 80జి మరియు 35 ఎ.సి నుండి మినహాయింపు వర్తిస్తుంది.
విరాళాలను ఏ నేషనలైజిడ్ బ్యాంక్ లోనైనా "Sreem Aparnaa Seva Trust" పేరున తీసిన D.D లను ఇవ్వవచ్చును. (లేదా)
మీ విరాళములను ఆంధ్రాబ్యాంక్ అకౌంట్: 014410100089819 (IFSC Code: UBIN0801445) - Aparna Seva Trust కు ఆన్ లైన్ ట్రాన్సఫర్ చెయ్యవచ్చును.
Daivajnaratna Dr. Sri A. Venkateswara Sarma Garu
Chairman - Sreem Aparna Seva Trust
Sreem Aparna Seva Trust is established in year 2012 but registered in 2016. The main aim of this trust is to serve the poor in rural areas by providing good medical facilities to public and quality education to children.
So far there are many activities are conducted on periodical and need basis. Still the activities are going on.
Sri Akondi Venkateswara Sarma garu is the Chairman of this trust with a 9 members board and has been planning and organizing the activities.
Sreem Aparna Seva Trust
Contact
Please contact us for any other information or related to trust activities - 9440341579/7013555437
Chairman, Sreem Aparna Seva Trust